చెక్కు

“రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు” అన్నాడు డాక్టర్ సుందర్.
“ఎందుకండీ?” అన్నాడు చంద్రం.
“ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట” అన్నాడు డాక్టర్.
“మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది” బదులిచ్చాడు చంద్రం.

నిద్రపోయే ముందు

డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి “ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి” అని అడిగాడు వాసు.

“రెండెందుకండీ?” అమాయకంగా అడిగాడు షాపువాడు.
“ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి

చిరుత ఆ తరువాత

ఈ మధ్య నాకు వచ్చిన forward mail:
చిరంజీవి కొడుకు సినిమా – చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల
కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?

బుడత – బాలకృష్ణ తనయ

ఉడత – వెంకటేష్ తనయ

మిడత – మోహన్ బాబు తనయ

పిచుక – పవన్ కళ్యాణ్ తనయ
……..

రుసరుసలు

“ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?” శ్రామలమ్మను అదిగింది వరమ్మ.
“ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే…….

ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది” కోపంగా అంది శ్యామలమ్మ.

భయం

“పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్” అన్నాడు నరసింహం

“అలాగా…. అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం” ఎదురన్నాడు కుర్రాడు.

కోరిక

“నాన్నా… నాన్నా… నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?” ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

“వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది” అన్నాడు తండ్రి.

“ఫర్లేదు నాన్నా… మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను” చెప్పాడు కొడుకు అమాయకంగా.

భయము

“నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను”

“ఏం…. మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?”

“కాదు….. నన్ను తోసేస్తుందని.”

ఏపక్క

“మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజూ పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క నిలిచుంటావు?” సుధాకర్‍ను అడిగాడు కరుణాకర్.

వంశపారపర్యం

“వెంకయ్యగారూ… ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది” చెప్పాడు డాక్టర్.
“అమ్మయ్య… బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి” చెప్పాడు వెంకయ్య.

మణ్యం మరణాలు

మన్యం మరణాలపై దృష్టిసారించి ప్రభుత్వం ప్రత్యేక

బృందాల్ని పంపుతోందంటే ఏంటో అనుకున్నా